Sneha latest photos goes viral in social media. Fans shocked with her new look
సీనియర్ హీరోయిన్ స్నేహ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో రాణించిన స్నేహ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2012 లో వివాహం అనంతరం సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది.
స్నేహ నటించినా తొలి తెలుగు చిత్రం తొలివలపు. గోపీచంద్ సరసన నటించిన ఈ చిత్రం 2001 లో విడుదలయింది. ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
స్నేహ తన కెరీర్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీ చిత్రం స్నేహాకు తెలుగులో తొలి విజయాన్ని అందించింది. శ్రీరామదాసు చిత్రం స్నేహ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది.
తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012 లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం స్నేహ సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది.
స్నేహ తెలుగులో సెకండ్ ఇనింగ్స్ షురూ చేసింది. బోయపాటి, రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంలో స్నేహ కీలక పాత్రలో నటించడానికి సిద్ధం అయింది. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.
స్నేహా తాజాగా ఓ ఈవెంట్ మెరిసింది. స్నేహా లుక్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చేలా ఉంది. స్నేహా మునుపటికంటే నాజూగ్గా కనిపించడం విశేషం. స్నేహ ఆ మధ్యన జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాని ఫలితమే స్నేహా నాజూగ్గా మారడానికి కారణం అని అభిమానులు అంటున్నారు.