'రంగస్థలం' పాటలు వింటూ బన్నీ కొడుకు ఇంట్లో గోల గోల చేస్తున్నాడంట. ముఖ్యంగా రంగా రంగా పాట వింటూ ఇంట్లో అందరి చెవులు పగిలిపోయేలా చేస్తున్నాడు. అయాన్ గోల పడలేక బన్నీ చెర్రీకి ఫోన్ చేసి మా వాడిని మీ ఇంటికి పంపిచేస్తాను అని చెప్పారట. ఈ విషయాలను ఇటీవల రామ్ చరణ్ 'రంగస్థలం' ఇంటర్వ్యూలో వెల్లడించారు. రంగస్థలం పాటలను అయాన్ ఎంతగానో ఇష్టపడుతుండటంతో ముచ్చటేసి... రంగస్థలంలో తన గెటప్ లాంటి దుస్తులను రెండు జతలు కుట్టించి అల్లుడికి గిఫ్టుగా పంపారు చరణ్. చెర్రీ మాదిరిగా లుంగీ కట్టుకుని అయాన్ ఫోజులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.