¡Sorpréndeme!

Kalyan Ram Says That He Will Become MLA

2018-03-23 103 Dailymotion

Kalyan Ram interview about MLA movie. Nandamuri Kalyan Ram's latest film 'MLA' releasing on march 23. As the teaser and other promos are impressive, the movie pre-release business closed at Rs.22 crores.

హీరో కళ్యాణ్ రామ్ 'ఎంఎల్ఏ' సినిమా మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.
ఎంఎల్ఏ అనగానే పొలిటికల్ సౌండ్ వస్తుంది. కానీ ఇది పొలిటికల్ సినిమా కాదు. దర్శకుడు ఉపేంద్ర కథ చెప్పినపుడే దీనికి ‘మంచి లక్షణాలున్న అబ్బాయి'(ఎంఎల్ఏ) అని టైటిల్ చెప్పాడు. నాకు కూడా బాగా నచ్చింది. సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. సినిమా ఎండింగులో ఎంఎల్ఏ అవుతాను... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో తీసుకోలేదు.పొలిటికల్ సెటైర్లు కూడా ఉండవు. ఎవరినీ విమర్శించలేదు. ఒక క్యారెక్టర్ చూట్టూ సినిమా తిరుగుతుంది కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఈ సినిమాకు హీరోయిన్ కాజల్‌ను ప్రొడక్షన్ వారే ముందే డిసైడ్ చేశారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. వారు స్ట్రిప్టు విషయంలో 100 శాతం ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు సినిమాకు ఏది కరెర్టో, ఎవరు కరెక్టో అదే చేశారు. సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుంది, కొత్త హీరోయిన్ అయితే సూట్ అవ్వరనే కాజల్ లాంటి పాపులారిటీ ఉన్న హీరోయిన్‌ను తీసుకున్నారు అని కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఈ ప్రొడక్షన్ నా సొంత బేనర్ కాక పోయినా.... నా సొంత బేనర్లో చేసిన ఫీలింగ్ కలిగింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా స్మూత్ గా సాగిపోయింది అని కళ్యాణ్ రామ్ తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంటులో పోసానిగారు మీరు ఎమ్మెల్యే అయితే చూడాలని ఉంది అన్నారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ... ఏమో తెలియదండీ... నేను ప్రొడక్షన్ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ పెట్టాను. నటుడిని అవుతానని అనుకోలేదు... అయ్యాను. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం, భవిష్యత్తులో అవుతానేమో? అంటూ ఆసక్తికర సమాధానం చెప్పారు.
నెక్ట్స్ మూవీస్ విరుంచి వర్మ, గుహన్‌లతో ఉంటాయి. ఇవి రెండు నా ప్రొడక్షన్లో చేయడం లేదు. నా ప్రొడక్షన్ నుండి ఏదైనా ఉంటే తప్పకుండా నేనే చెబుతాను.
ఫెయిల్యూర్స్ వస్తే బాధగానే ఉంటుంది. ఒక్కో సినిమా దాదాపు ఆరు నెలలు ఎంతో కష్టపడి పనిచేస్తాం. ఎంతో మంది చెమటోడుస్తారు. ఆశించిన ఫలితం రాకుంటే కష్టంగానే ఉంటుంది.... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.