¡Sorpréndeme!

వర్మ కి నో చెప్పిన విజయ్ దేవరకొండ!

2018-03-13 686 Dailymotion

Vijay Devarakonda Shocks Varma. Vijay Devarakonda says no to RGV movie proposal

వర్మ తన దర్శకత్వ ప్రతిభతో ట్రెండ్ సెట్ చేయగలిగేంత టాలెంట్ ఉన్న దర్శకుడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తున్నాడు. వర్మ తాజాగా నాగార్జునతో ఆఫీసర్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. వర్మకు చిత్రాలని ప్రకటించడం వాటిని పక్కన పెట్టేయడం బాగా అలవాటే.
రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. వర్మ తెరకెక్కించిన జీఎస్టీ చిత్రం విషయంలో ఏస్థాయిలో దుమారం రేగిందో అందరికి తెలిసిందే. వర్మపై జీఎస్టీ చిత్రం విషయంలో పోలీస్ కేసు కూడా నమోదైంది.
వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఆ మధ్యన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఆ చిత్ర ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఆ చిత్రాన్ని వర్మ పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. వర్మ సినిమాలని ప్రకటించడం వాటిని పక్కన పెట్టేయడం అతడికి అలవాటే.
అర్జున్ రెడ్డి చిత్రం తరువాత వర్మ కన్ను విజయ్ దేవరకొండపై పడింది. ఆ చిత్రాన్ని, విజయ్ దేవర కొండని వర్మ ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటన అందరిని ఆకట్టుకుంది. అప్పుడే వర్మ కన్ను విజయ్ పై పడింది.
ప్రస్తుతం నాగ్ తో సినిమా చేస్తున్న వర్మ ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ భావించాడట. అతడి కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడట. వర్మ విజయ్ దేవరకొండని సంప్రదించగా ఊహించని సమాధానం ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తాను చేయలేనని విజయ్ వర్మకు చెప్పాడట.