Ailing actor Irfan Khan's wife says her partner is facing his health scare -- a "rare disease" -- like a "warrior". But Umair Sandhu tweeted that Officially Confirmed, Indian doctors asked IrfanKhan to go to USA for treatment. He is in very bad situation and having only 6-12 months more time. Our all prayers are with IrrfanKhan.
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్‌కు సన్నిహితులు, స్నేహితులు, సహచర నటులు అండగా నిలుస్తున్నారు. శ్రీదేవి మరణవార్త నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సినీలోకానికి ఇర్ఫాన్ వ్యాధి వార్త తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై భార్య సుతాప సిక్దర్ ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేశారు. ఇర్ఫాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కష్టకాలంలో సపోర్ట్‌గా నిలిచిన వారికి నా థ్యాంక్స్.
ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం పర్వాలేదు. ఆయన బాధపడుతున్న వ్యాధిపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దు.
విపత్కర పరిస్థితుల్లో నా భర్త ఓ యోధుడిగా మార్చిన దేవుడికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఆ అరుదైన వ్యాధి నుంచి ఎలా బయటపడాలి అనే విషయంపై వైద్యులపై సంప్రదింపులు జరుపుతున్నాం.
ఇర్ఫాన్ సోకిన వ్యాధి గురించి తలచుకొంటేనే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను కాదు మా కుటుంబం, స్నేహితులు, ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. కానీ ఇర్ఫాన్ మాత్రం మనో నిబ్బరంగా ఉన్నాడు. ఆ మహమ్మారిపై విజయం సాధిస్తాడు అనే విశ్వాసాన్ని సుతాప వ్యక్తం చేశారు.