In a video that’s gone on viral on social media, Virat Kohli giving a head massage to opener Shikhar Dhawan in third T20I between India and South Africa
సుదీర్ఘమైన సఫారీ పర్యటనను కోహ్లీసేన ఘనంగా ముగించింది. మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని 52 రోజుల సఫారీ ప్రదర్శనను విజయ వంతంగా ముగించింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 7 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మూడో టీ20 జరిగిన సమయంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు విరాట్ కోహ్లీ మసాజ్ చేస్తూ కనిపించాడు. వెన్నునొప్పి కారణంగా మూడో టీ20కు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ఏ ఆటగాడైనా డ్రస్సింగ్ రూమ్‌కు పరిమితమై చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ, విరాట్ అందుకు భిన్నం. టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా సహచర ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు.
ఈ క్రమంలో ధావన్ ఔటై వచ్చిన తర్వాత అతనితో కోహ్లీ ముచ్చటిస్తూ మసాజ్ చేశాడు. సుమారు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో 'ఇలాంటి ఫ్రెండ్ ఒకడు కావాలి', 'విరాట్ కోహ్లీ తన నైపుణ్యాన్ని ధావన్‌కు బదిలీ చేస్తున్నాడు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.