¡Sorpréndeme!

Rajamouli Sets Pair For Ram Charan, What About NTR

2018-02-21 860 Dailymotion

Creative director rajamouli sets herione to ramcharantej for upcoming film with jr.NTR


దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత ఏ హీరోతో ఎలాంటి చిత్రం తీయబోతున్నాడనే ఉత్కంఠ అంతటా నెలకొంది . కాగా ఎన్టీఆర్ మరియు రాంచరణ్ తో రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. బాహుబలి చితం తరువాత రాజమౌళి ఖ్యాతి జాతీయ వ్యాప్తం అయింది.తదుపరి చిత్రం రాంచరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాంచరణ్ కు హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాశి ఖన్నా వరుణ్ తో పండించిన రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది. చరణ్ సరసన కూడా రాశి ఖన్నా ఒదిగిపోతుంది అని అభిమానులు అంటున్నారు.
రాజమౌళి మల్టి స్టారర్ చిత్రం మొదలు కావాలంటే ముందుగా చరణ్, ఎన్టీఆర్ కమిటైన సినిమాలు పూర్తి కావాలి. రంగస్థలం చిత్రం ఓ కొలిక్కి వచ్చింది. బోయపాటి సినిమా కొద్దీ రోజుల క్రితమే పార్రంభం అయింది. దీనితో చరణ్ ఈ చిత్రాన్ని ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అనేదే సస్పెన్స్.ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రానికి కమిటై ఉన్నాడు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆలస్యంగా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి అప్పటి వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.