¡Sorpréndeme!

Veer Yodha Mahabali First Look Same As Baahubali

2018-02-12 1,634 Dailymotion

The posters of Bhojpuri superstar Dinesh Lal Yadav aka Nirahua starrer Veer Yoddha Mahabali are out.

బాహుబలి, మహాబలి చూస్తుంటే ఈ రెండు టైటిల్స్ ఒకేలా అనిపిస్తున్నాయి కదూ! టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ గెటప్ కూడా బాహుబలి చిత్రం చూసినట్లే ఉన్నాయి. దీంతో ఇది బాహుబలి చిత్రానికి రీమేక్ అని కొందరు అంటుండగా...... ఇప్పటి వరకు బాహుబలి రీమేక్ రైట్స్ అమ్మినట్లు అఫీషియల్ సమాచారం లేదని, ఇది కాపీ కొట్టి తీస్తున్నారేమో? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భోజ్‌పూరి నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ అలియాస్ నిరహువా హీరోగా ‘వీర్‌ యోధ మహాబలి' చిత్రం తెరకెక్కుతోంది. అమ్రపాలి డుబే కథానాయిక. ఇక్బాల్‌ బక్ష్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఎం. రమేశ్‌ వ్యాస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భోజ్‌పురితో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, బెంగాళీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా ఈ పోస్టర్ షేర్ చేశారు. అయితే ఈ పస్ట్ లుక్ చూసి బాహుబలి సినిమా అభిమానులంతా షాకవుతున్నారు. హీరో గెటప్, బ్యాక్ డ్రాప్ కూడా బాహుబలిని పోలి ఉండటమే ఇందుకు కారణం.
వీర్‌ యోధ మహాబలి'..... బాహుబలికి కాపీ అని కొందరు, రీమేక్ అని కొందరు అంటున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. అయితే మహాబలి చిత్ర నిర్మాతలు మాత్రం ఇది రీమేక్ అని ఇప్పటి వరకు ప్రకటించలేదు.
ఇండియన్ సినీ చరిత్రలో బాహుబలి అనేది ఒక మాస్టర్ పీస్. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా, రూ. 1000 కోట్లు మార్కు అందుకున్న తొలి సినిమా. ఈ సినిమా థీమ్ ఫాలో అవూతూ లేదా కాపీ కొడుతూ ఎన్ని చిత్రాలు వచ్చినా...... బాహుబలి కింద దిగదుడుపే అని అంటున్నారు బాహుబలి ఫ్యాన్స్.