If India win on Saturday, or in any of the three ODIs remaining, it will record its first-ever ODI series win in the South Africa. Virat Kohli's team holds a 0-3 series lead and has three bites at securing its maiden ODI series win on South African soil.
సఫారీ గడ్డపై ప్రస్తుతం జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియానే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒక్కటంటే ఒక్క వన్డే గెలిస్తే చాలు సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఈ చరిత్రకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది.
దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సిరిస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది.
ఎందుకంటే సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకూ టెస్టు సిరిస్‌తో పాటు వన్డే సిరీస్‌ను గెలవలేదు. దీంతో ఈ సిరిస్‌ను గెలిచేందుకు గాను భారత్‌కు ఓ సువర్ణావకాశం. నాలుగో వన్డేలో విజయం సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని కోహ్లీసేన భావిస్తుండగా, శనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని సఫారీలు చూస్తున్నారు.
ఇక నాలుగో వన్డే నేపధ్యంలో జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో బారత ఆటగాళ్ళు చెమటలు చిందిస్తూ ప్రాక్టిసు చేస్తున్నారు.