¡Sorpréndeme!

Under-19 Boys Did Not Play Well But ‘Got Desired Result’

2018-02-06 338 Dailymotion

In the first media interaction at home after clinching the under-19 world championship on Monday, Indian coach Rahul Dravid said that the under-19 boys did not play its number one game in the final, though they got the desired result.


అండర్ 19 కుర్రాళ్లు భారత్ కు ప్రపంచ విజేతలుగా తిరిగొచ్చారు. స్వదేశంలో వారికి ఘన స్వాగతం లభించింది. రావడంతోనే అండర్-19 కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్, కుర్రాళ్ల కెప్టెన్ పృథ్వీ షా విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు.
16 నెలలుగా కష్టపడిన తీరు కప్ గెలవడం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. 'అండర్‌-19 క్రికెట్ కప్‌ గెలవడం చాలా గర్వంగా ఉంది. కానీ, మా జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో నంబర్‌వన్‌ ఆట ఆడలేదు. అయితే మేం కోరుకున్న ఫలితమే వచ్చింది. కుర్రాళ్లు ఇంకా అసలైన ఆటను బయటపెట్టాల్సి ఉంది' అని ద్రవిడ్‌ అన్నారు.
కష్టపడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ విజయంతో వారు తెలుసుకున్నారు. అయితే తర్వాతి స్థానానికి వెళ్లడం అంత సులభం కాదు.2012లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని ఒకరికి మాత్రమే టీమిండియాలో ఆడే అవకాశం వచ్చింది. కాబట్టి అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది' అంటూ కుర్రాళ్లను ఉద్దేశించి ద్రవిడ్‌ అన్నారు.