¡Sorpréndeme!

YS Jagan Speech @ South Mopur In Nellore District

2018-02-05 7,757 Dailymotion

The Praja Sankalpa Yatra taken up by YSR Congress Party President YS Jagan Mohan Reddy has been receiving huge response as people extended massive support in Nellore district.

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, సౌత్ మోపూరు బ‌హిరంగ‌ స‌భ‌లో జగన్. బడ్జెట్ పై బాబు వింత డ్రామాలు ఆడుతున్నారన్న జగన్ . కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో సాగింది. ఆవేదనతో రగులుతున్న ఆప్తులకు ‘నేనున్నానని, మీకేం కాదని’ జననేత వైఎస్‌ జగన్‌ ధైర్యం చెబుతుంటే.. జనం ఆకాంక్షిస్తూ.. ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియకుండానే కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? అసలు బడ్జెట్‌ ప్రవేశపెట్టేది ప్రధాని నరేంద్ర మోదీ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రులంతా కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదం తెలిపాకే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ విషయం తెలిసీ కూడా ఏమీ ఎరగనట్టు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు డ్రామా లాడుతున్నార’ని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.