¡Sorpréndeme!

టచ్ చేసి చూడు రివ్యూ : Why you Should Watch this Movie

2018-02-02 32 Dailymotion

Here are the reasons why you should watch Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor starrer Touch Chesi Chudu movie

రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడు. దర్శకుడు విక్రమ్ సిరికొండతో కలిసి, తన ఎనర్జీకి సరిపడే టైటిల్‌‌ను, కథను ఎంచుకొని రవితేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటించారు. మాస్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలు కలిసి ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజైంది. రాజా ది గ్రేట్ మాదిరిగానే రవితేజ్‌కు ఈ చిత్రం సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కార్తికేయ (రవితేజ) నిజాయితీ, బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. డ్యూటీని తప్ప ఫ్యామిలీ పట్టించుకొని మెంటాలిటి. లాలా (ఫ్రెడ్డీ దారువాలా) అనే రాజకీయ నాయకుడితో వైరం ఏర్పడుతుంది. ఆ క్రమంలో కానీ కొన్ని కారణాల వల్ల డ్యూటికి దూరం అవుతాడు. ఏ కారణంగా విధులకు దూరంగా ఉంటాడు. కానీ ఓ లక్ష్యం కోసం మళ్లీ డ్యూటీలో చేరుతాడు.
డ్యూటీలో చేరిన కార్తికేయ తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? కార్తీకేయ జీవితంలో దివ్య (సీరత్ కపూర్), పుష్ఫ (రాశీ ఖాన్నా) పాత్రలేమిటీ? ఏ కారణంగా పోలీస్ వృత్తికి దూరమయ్యాడు? టీచర్ (సుహాసిని) పాత్ర ఏమిటి? లాలా రాజకీయ ఎత్తులకు కార్తీకేయ ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే టచ్ చేసి చూడు సినిమా కథ.