Watch A man climbs temple steps by knees for Chandrababu, he wants Chandrababu again as cm in 2019 elections
2019 లో అంతా మంచి జరగాలని, చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి వచ్చి సీఎం కావాలని, అలాగే అమరావతి సుభిక్షం గా ఉండాలని కోరుతూ ఓ వ్యక్తి మోకాళ్లపై మంగళగిరి కొండ మెట్లు ఎక్కాడు. 2007 నుండి ఎప్పటికీ చంద్రబాబు అధికారం లో ఉండాలని కోరుకుంటూ 40 వ కొండ గా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి కొండ మెట్లు ఎక్కాడు. నల్లగొండ జిల్లా కు చెందిన సోలిపురం ఏసుదేవ రెడ్డి ఈ రోజు ఉదయం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఎగువ సన్నిధి లో గల 347 మెట్లు మోకాళ్ళ పై ఎక్కారు. చంద్రబాబు పాలన అంతా మంచిగా జరగాలని, అమరావతి నిర్మాణం బాగుండాలని, పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షం గా ఉండాలని కొండ పై స్వామీ వారిని కోరుకున్నామని ఏసుదేవ రెడ్డి తెలిపారు. అదేవిధం గా మంగళగిరి నియోజకవర్గం లో టీడీపీ తరపున పోటీ చేయనున్న గంజి చిరంజీవి గెలుపు సాధించాలని, చంద్రబాబు కు మద్దతుగా అన్ని నియోజక వర్గాలలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు విజయం సాధించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఏసుదేవ రెడ్డి అన్నారు.