¡Sorpréndeme!

నెత్తిన పెట్టుకుంటే చిన్నచూపా ? 'నయన్'పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్..!

2018-01-27 439 Dailymotion

Telugu fans are hurt about Nayanatara comments in an recent interview for saying Kollywood actors only her favourite.

వ్యక్తిగత విషయాల్లో ఎవరి ఛాయిస్ వారిది. పక్కనవాళ్ల అభిప్రాయాలను ఇంకొకరి మీద రుద్దడం సరికాదు. పాపం.. నయనతార విషయంలో కొంతమంది అభిమానులు ఇప్పుడిలాగే వ్యవహరిస్తున్నారు. తన అభిమాన నటులెవరు అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం కొంతమందికి ఆగ్రహం తెప్పించిందట. అంతే.. నయనతారను చెడా మడా కడిగేస్తూ సోషల్ మీడియాలో ఆమెపై నిప్పులు చెరుగుతున్నారట..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతారను మీ అభిమాన నటుడు ఎవరు? అని ప్రశ్నించగా.. మరో మాట లేకుండా కోలీవుడ్‌ హీరోలు అజిత్‌, విజయ్‌లు అని చెప్పేసింది. ఈ మాటే కొంతమంది తెలుగు అభిమానులకు నచ్చలేదట. ఏం.. నయనతార తెలుగులో సినిమాలు చేయలేదా?.. ఇక్కడివాళ్లలో ఒక్క అభిమాన హీరో కూడా లేరా? అని ప్రశ్నిస్తున్నారట.
కోలీవుడ్‌లో ఆమె సూపర్ స్టార్ స్థాయికి ఎదగకముందే.. టాలీవుడ్ ఆమెను నెత్తినపెట్టుకుందని సదరు అభిమానులు గుర్తుచేస్తున్నారట. టాలీవుడ్ నయనతారకు ఇంత చేస్తే.. ఇక్కడ హీరోల గురించి మాత్రం ఆమె ప్రస్తావించకపోవడమేంటనేది వారి ఆవేదన.
అభిమానుల ఆవేదన సంగతి ఎలా ఉన్నా.. వ్యక్తిగత అభిప్రాయాలను కూడా గౌరవించకపోతే ఎలా అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది.
ఇంకొంతమంది నయనతారకు టాలీవుడ్ అంటే చిన్నచూపు కాబట్టే.. కోలీవుడ్ హీరోల పేర్లు మాత్రమే చెప్పిందంటున్నారు. టాలీవుడ్ నటులు కూడా ఇష్టమేనని ఒక మాట చెబితే సరిపోయేది కదా అంటున్నారు. అయినా అభిమాన హీరోలు కోలీవుడ్ అయినంత మాత్రానా.. టాలీవుడ్ అంటే చిన్న చూపా? అనుకోవడం లేనిపోనివి ఆపాదించుకోవడమే అవుతుంది తప్ప.. ఆ విషయాన్ని నయనతారకే వదిలేస్తే ఇంత గొడవ ఉండదు కదా అనేది కూడా గమనించాల్సిన విషయం.