¡Sorpréndeme!

రూ. 120 కోట్ల లాస్.. ఆదుకోవాలని ఉన్నా ఏమీ చేయలేక పవన్..!

2018-01-26 1,115 Dailymotion

Pawan Kalyan's recent films total loss 120 crores. Pawan Kalyan's recent films Sardaar Gabbar Singh, Katamarayudu, Agnyaathavaasi gave the biggest jolt to everyone in the business by ending up a disaster.

సినిమా వ్యాపారం అంటే జూదం లాంటిదే అని అంటుంటారు. ఒక సినిమా హిట్టవుతుందా? లేదా? అనేది విడుదల అయ్యే వరకు ఎవరూ చెప్పలేరు. సినిమా రంగంలోకి వచ్చి అదృష్టం కలిసొచ్చి హిట్స్ కొట్టి కోట్లకు పడగలెత్తినవారు..... కోట్ల ఆస్తులను పోగొట్టుకుని రోడ్డున పడ్డవారు ఎందరో ఉన్నారు. తమతో సినిమాలు తీసి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కొందరు పెద్ద పెద్ద స్టార్స్ తమ వంతు ప్రయత్నం చేస్తుండటం తరచూ చూస్తున్నాం. నష్టపోయిన నిర్మాతకు మళ్లీ ఫ్రీగా సినిమా చేసి పెట్టడమో? నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు ఎంతో కొంత పూడ్చేలా తమ తర్వాతి సినిమా రైట్స్ ఇప్పించడం లాంటివి చేస్తుంటారు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే వారిలో ప్రముఖుడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాల్లో సీరియస్ గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ఎంట్రీకి ముందు మూడు సినిమాలు చేశారు. ఆ మూడు చిత్రాలు భారీగా నష్టలే మిగిల్చాయి.
‘అత్తారింటికి దారేది' హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం వల్ల దాదాపు రూ. 20 కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా.
‘సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత వచ్చిన ‘కాటమరాయుడు' చిత్రానికి దాదాపు రూ. 90 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే రికవరీ అయింది కేవలం 61 కోట్లు మాత్రమే. దీంతో 30 కోట్ల నష్టం తప్పలేదు.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ముందు నుండి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇటీవల వచ్చిన ‘అజ్ఞాతవాసి' సినిమాకు గత రెండు ప్లాపులతో సంబంధం లేకుండా రూ. 125 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే సినిమా ప్లాప్ కావడంతో గత రెండు చిత్రాలను మించిన నష్టం వాటిల్లింది. ఈ ఒక్క చిత్రం ద్వారానే దాదాపు 70 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా..