¡Sorpréndeme!

Wi-Fi పాస్‌వర్డ్ తెలుసుకోవడం ఎలా ? చిన్న టిప్స్ .

2018-01-25 16 Dailymotion

మీరు మీ వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారా..?, ఇతరుల వైఫై నుంచి ఇంటర్నెట్ పొందలానకుంటున్నారా..?, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసిన వై-ఫై నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను ఎలా చూడాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..?ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మారుమూల గ్రామాల్లో సైతం అందుబాటులో వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌ను వాడే స్థాయికి చేరుకున్నారు. అంతేకాదు ఒకరోజు కోసం ఇంటర్నెట్ ప్యాక్, ఒకనెల కోసం చౌకైన ఇంటర్నెట్ ప్యాక్స్, పబ్లిక్‌లో ఉచిత వై-ఫై, వై-ఫై రౌటర్ ద్వారా ఇంట్లోనూ వై-ఫై‌ను వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో సందర్శిస్తున్న ప్రదేశాల్లో చాలావరకు కాఫీ దుకాణాలు, రెస్టారెంట్లలో వైఫైను సదుపాయం కల్పిస్తున్నారు. కానీ వెళ్లిన ప్రతిసారీ వై-ఫై పాస్‌వర్డ్‌ను అడుగుతూ ఎదుటివారి ముందు షేమ్‌గా ఫీల్ అవాల్సి ఉంటుంది. అయితే, ప్రతిసారి అలా చేయకుండా...ఒకసారి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనెక్ట్ అయిన తర్వాత పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. మీరు గతంలో ఫోన్‌కు కనెక్ట్ చేసిన నెట్‌వర్క్ వై-ఫై పాస్‌వర్డ్‌ను అవసరమైనప్పుడు తెలుసుకోవడం మంచిది.