¡Sorpréndeme!

పవన్‌పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?

2018-01-20 1,117 Dailymotion

Ram Gopal Varma tweeted that one should not blame Trivikram for the movie’s flop because no director in the world would do justice to Pawan Kalyan’s charisma and image.


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య గత కొద్దికాలంగా ట్విట్టర్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' ఇటీవల ఆర్జీవి విమర్శనాస్త్రాలను ట్వీట్ల రూపంలో సంధించారు. అయితే అలాంటి ట్వీట్లను వెంటనే డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకసారి పోస్టు చేసిన తర్వాత తన ట్వీట్లను తొలగించడం లాంటి పనులు చేయరు. అయితే తాజాగా పవన్ కల్యాణ్‌పై చేసిన ట్వీట్లు డిలీట్ చేయడంతో ఇన్‌సైడ్‌గా ఏదో జరిగి ఉంటుంది అనే వాదన ఫ్యాన్స్‌లో మొదలైంది. ఇంతకీ పవన్ కల్యాణ్ గురించి వర్మ ఏం కామెంట్ చేశారంటే..
‘అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ అయినందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను నిందించవద్దు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఉన్న చరిష్మా, ఇమేజ్‌కు ప్రపంచంలోని ఏ దర్శకుడైనా న్యాయం చేయలేడు అని వర్మ ట్వీట్ చేశారు.
ప్రపంచంలోని దిగ్గజ డైరెక్టర్లు సైతం పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తే విఫలం కావొచ్చు. వారు కూడా ఆయన ఇమేజ్‌కు అనుగుణంగా సినిమా తీయలేకపోవచ్చు అనే అనుమానాన్ని వర్మ వ్యక్తం చేశాడు.
పవన్ కల్యాణ్‌పై ఇలా ట్వీట్లు చేయడం వెనుక రాంగోపాల్ వర్మ ప్రశంసల కంటే చురకలే ఎక్కువగా కనిపించాయి. అయితే ట్వీట్లు చేసిన తర్వాత ఏమైందో ఏమో వెంటనే వాటిని వర్మ తొలగించారు.
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ట్విట్టర్ టైమ్‌లైన్‌పై గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ప్రమోషన్ వీడియోలు, చిత్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ షార్ట్ ఫిలిం జనవరి 26న విడుదల కానున్నది.