¡Sorpréndeme!

ఎపి రైతు వీడియో మెసేజ్.. ఇతని ఆవేదన చూస్తే కన్నీళ్ళు ఆగవు..!

2018-01-20 940 Dailymotion

A Frustated farmer video Going Viral In Social Media.

ఓ రైతు పెట్టిన వీడియో అధికారులకు సమస్యగా మారింది. ఏం చేయాలో పాలుపోక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తాను కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు వీడియో మెసేజ్ పెట్టాడు.
గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజా అనే రైతు ఆ వీడియో పోస్టు చేశాడు. పాస్ బుక్ ఇవ్వడానికి అధికారులు చేస్తున్న జాప్యంపై విసిగిపోయి అతను ఈ చర్యకు దిగాడు.
తనకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించిందని, నిరుడు మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు సోకి మొత్తం పోయిందని, పంట కోసం తాను చేసిన అప్పు రూ. 8 లక్లలు, ఇప్పటికీ వడ్డీతో సహా 10 లక్షల రూపాయలు అయిందని రాజా వీడియో మెసేజ్‌లో చెప్పాడు.
తన ఎకరా భూమి అమ్మి అప్పు తీర్చేద్దాని నిరుడు 13వ తేదీన స్థానిక సర్వేయర్‌కు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పటికి పదిసార్లు తనను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నాడని, అయినా పాస్ పుస్తకం ఇవ్వలేదని తన గోడును వెళ్లబోసుకున్నాడు.
అధికారుల తీరుతో విసిగిపోయిన రాజా ఈ నెల 22వ తేదీన కలెక్టర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. తాను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని అని కూడా చెప్పుకున్నాడు. ఏం ప్రభుత్వం ఇది, రైతే రాజన్నారు, ఇదేనా చంద్రబాబు పాలన అని అతను ప్రశ్నించాడు..
తాను చనిపోయిన తర్వాత చంద్రన్న బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తారని తెలిసిందని, దయచేసి ఆ మొత్తాన్ని తన కుటుంబానికి ఇవ్వాలని, తన ఎకరా పొలం అమ్మితే ఐదు లక్షల రూపాయలు వస్తాయని, మొత్తం పది లక్షల రూపాయలతో అప్పు తీర్చేయవచ్చునని అతను చెప్పాడు.