¡Sorpréndeme!

కోర్టుకు హాజరైన యాంకర్ రవి..!

2018-01-10 10 Dailymotion

Anchor Ravi was present at the Nampally court. Anchor Ravi Clarifies on his Controversy over his saying 'super' after Actor Chalapathi Rao vulgar Comments on Women.

రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరిపై కేసు కూడా నమోదయింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం ఉదయం యాంకర్ రవి నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.
ఈ కేసు యాంకర్ రవిని ఇంకా వెంటాడుతూనే ఉంది. మహిళలను కించపరిచారన్న అభియోగాలతో రవిపై కేసు కోర్టులో ఇంకా కొనసాగుతోంది. కోర్టు వాయిదాకు హాజరైన రవి మాట్లాడుతూ తన మాటలను మీడియా వక్రీకరించిందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పాడు.
ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు.
ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనకు ఏ పాపం తెలియదని..... అపుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని, ఆయన అంత నీచమైన కామెంట్స్ చేసారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి గతంలో ఓ ఇంటర్వ్యూలో వాపోయారు.
అయితే రవిని ఇండస్ట్రీని నుండి బహిష్కరించాలనే మహిళా సంఘాల ఆ మద్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రవి స్పందిస్తూ... నేను ఆ మాట అనుంటే నేనే తలొంచుకుని సిగ్గుపడే వాడిని. చలపతి రావు అన్న మాట నాకు వినపడలేదని చెప్పినా... ఎవరూ విపించుకోరు, అర్ధం చేసుకోరు. కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేమని యాంకర్ రవి తెలిపారు.