¡Sorpréndeme!

కోర్టుకు ప్రదీప్ డుమ్మా, హాజరైన యాంకర్ రవి !

2018-01-10 2 Dailymotion

Anchor Pradeep may not attend to the court today in drunk and drive case due to busy in shooting.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కోర్టు డుమ్మా కొట్టారు. ఆయన బుధవారంనాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని సమాచారం ఇవ్వడంతో ఆయన కోర్టుకు హాజరు కారనే భావిస్తున్నారు. యాంకర్ ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన కౌన్సిలింగ్‌లో తన తండ్రితోపాటు పాల్గొన్నాడు.మంగళవారమే ప్రదీప్ హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే కేసుకు సంబంధించిన నివేదికలు కోర్టుకు అందడంలో జరిగిన జాప్యంతో బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ దాదాపు వారం రోజుల తర్వాత పోలీసుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపినవారికి వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తాను ఎక్కడికీ పారిపోలేదని అంటూ ఓ వీడియోనువిడుదల చేశాడు. త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పిన ప్రదీప్ చివకు సోమవారం పోలీసులు ముందుకు వచ్చాడు.