¡Sorpréndeme!

కోర్టుకు యాంకర్ ప్రదీప్‌.. షాకిచ్చిన పోలీసులు !

2018-01-10 1,236 Dailymotion

Television anchor Pradeep Machiraju has landed in a huge trouble having caught in drunk & drive by the Hyderabad Traffic Police. The court may grant imprisonment to Pradeep considering his breathe analyser test and there are high chances of revoking his drive license as well.

డ్రంక్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ప్రదీప్ కంటికి కనిపించకుండా పోయారు.
అనేక మీడియా కథనాల మధ్య డ్రంక్ డ్రైవ్ వ్యవహారంలో ప్రదీప్ సోమవారం (జనవరి 8 తేదీన) పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా ప్రదీప్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రదీప్‌ను జనవరి 10న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘటన కేసు, వాహనానికి బ్లాక్ ఫిల్మ్ వ్యవహారంలో ప్రదీప్‌ను కోర్టు విచారించే అవకాశం ఉంది.
డిసెంబర్ 31వ తేదీన ప్రదీప్‌ పట్టుబడిన సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనాన్ని ట్రాఫిక్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వివరాలను, బ్రీత్ అనలైజర్ పరీక్షలో వెల్లడైన పాయింట్లు, కౌన్సెలింగ్ జరిగిన తీరుపై నివేదికను ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.