¡Sorpréndeme!

కోడి పందాలకు చెక్ : ఈ సంక్రాంతి కి డవుటే నా ?

2018-01-03 76 Dailymotion

High Court orders Andhra Pradesh CS and DGP to curtail cock fights during Sankranti festival.

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రదేశాల్లో కోడి పందేలు జరగకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశించింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించకుండా చూడాలని ఆదేశించింది. కోడిపందేలను నిర్వహించకుండా చూడాలని గతంలో తాము జారీచేసిన ఉత్తర్వులను సరిగా అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంక్రాంతికి తమ ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే సీఎస్‌, డీజీపీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని కూడా హెచ్చరించింది.

కోడిపందేలు నిర్వహించి తీరుతామని ప్రజాప్రతినిధులు కొంత మంది బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని, వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడిపందేల వల్ల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, కోడిపందేలు ఓ వ్యాధిని అని, వాటిపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉండదని విమర్శించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ముసుగులో కోడి పందేలు నిర్వహిస్తున్నారని, పందేలు నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పలేదని అభిప్రాయపడింది. కోడిపందేలపై 2016 డిసెంబర్‌ 26న ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తప్పు పట్టింది.