¡Sorpréndeme!

స్పీడ్ మీదున్న సుధీర్‌బాబు.. హీరోయిన్ తో రొమాన్స్..

2017-12-30 268 Dailymotion

Hero Sudheer Babu' latest movie with Aditi Rao Hydari. This movie directed by Indraganti Mohana Krishna, Produced by Shivalenka Krishna Prasad. Cinemotography by PG Vinda. This movie getting ready for Summer.



సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్త‌యింది. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``డిసెంబ‌ర్ 11 నుంచి 23 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోతొలిషెడ్యూల్ చేశాం. హీరో ఇంటికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్ రూపుదిద్దిన హీరో హౌస్ సెట్ చాలా స్పెష‌ల్‌గా ఉంటుంది. ఈ స‌న్నివేశాల్లో ఆ సెట్ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. అవుట్ ఫుట్ చాలా సంతృప్తి కరం గా వస్తోంది.
జ‌న‌వ‌రి 1 నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. అది కూడా భాగ్య‌న‌గ‌రంలోనే ఉంటుంది. ఇంకా టైటిల్‌ ఖ‌రారు చేయ‌లేదు. సంక్రాంతి త‌ర్వాత టైటిల్ ప్ర‌క‌టిస్తాం.మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం`` అని అన్నారు.