¡Sorpréndeme!

‘హలో’... కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

2017-12-30 773 Dailymotion

The theatrical rights of Akkineni Akhil debut film "Hello" were sold for Rs. 32 crores and the movie got released grandly. Summing up the first seven days collections of film the movie made Rs. 15.7 crores. The movie still has ro collect Rs. 16 crores to become a hit.



అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'హలో' మూవీ క్రిస్మస్ సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా చూసిన సగటు ప్రేక్షకుడి నుండి సినిమా గొప్పగా ఉంది అనే ప్రశంసలు గానీ, చెత్తగా ఉందనే విమర్శలగానీ రావడం లేదు. జస్ట్ ఓకే... టైమ్ పాస్ మూవీ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా బాక్సాఫీసు వద్ద వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి వసూళ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు ఎంత రాబట్టింది? లాభాలు వచ్చే పరిస్థితి ఉందా? లేదా? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
బాక్సాఫీసు వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘హలో' మూవీ తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.7 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 11 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల నుండే వసూలైంది.
‘హలో' మూవీ థియేట్రికల్ రైట్స్ నైజాం, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ. 32 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా కావడం, అఖిల్ సినిమాపై జనాల్లో కాస్త క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తానికి రైట్స్ అమ్ముడయ్యాయి