¡Sorpréndeme!

హరితేజకు అల్లు అర్జున్ వార్నింగ్ !

2017-12-27 4,613 Dailymotion

Allu Shirish's Okka Kshanam movie pre release function organised recently in Hyderabad. Allu Arjun was the special guest for the event. Between Allu Arjun and Anchor Hariteja a interesting discussion went in the event. Eventually Allu Arjun threw a satire on Hari Teja.


తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షోకు ముందు హరితేజ చిన్న చితక పాత్రల్లో నటిస్తూ అంతగా గుర్తింపులేని యాక్టర్‌గా ఉండేది. ఒక్కసారి బిగ్‌బాస్‌లో తన ప్రతిభను బయటపెట్టిన తర్వాత ఆమె కెరీర్ గ్రాఫే మారిపోయింది. టాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా టీవీషోలు, సినిమాలు, సినీ వేడుకల్లో యాంకర్‌గా రాణిస్తూ హరితేజ దుమ్ము దులిపేస్తున్నది. అలాంటి హరితేజకు ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్నపాటి వార్నింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇంతకు ఏమైందటే..
తన సోదరుడు నటించిన ఒక్క క్షణం చిత్రం ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అందరు యాంకర్ల మాదిరిగానే హరితేజ ఫంక్షన్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తెసింది. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అని హరితేజ తన మనసులో మాట బయటపెట్టుకొన్నది.
అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం అని చెప్పిన హరితేజపై బన్నీ సెటైర్లు వదిలాడు. మరో సినీ వేదికపై మరో హీరో ఇష్టం అని చెబితే ఊరుకోను. అప్పుడే కచ్చితంగా మీకు ఫోన్ చేసి అడుగుతా అని బన్నీ చిన్నపాటి వార్నింగ్‌ను సరదాగా ఇచ్చాడు.
బన్నీ వార్నింగ్‌ను సరదాగా తీసుకొంటూ హరితేజ తన దైన శైలిలో సమాధానమిచ్చింది. కచ్చితంగా మీరు అంటే ఇష్టం. ఏ సెంటర్లోనైనా నీ పేరే చెబుతా. మీరే నాకు ఇష్టం అని హరితేజ తియ్యగా బదులిచ్చింది. దాంతో ఆ ఆసక్తికరమైన చర్చ ముగిసింది.