¡Sorpréndeme!

సంధ్యారాణి పై కార్తీక్ తల్లి ఆగ్రహం, ఆరోపణలు !

2017-12-22 237 Dailymotion

Karthik Mother Urmila on Friday said that his made fault in his lover Sandhya Rani matter.


కార్తీక్ తాను ప్రేమించిన సంధ్యా రాణిని పెట్రోలు పోసి సజీవ దహనం చేయడంపై అతని తల్లి ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మూర్ఖంగా వ్యవహరించాడని అన్నారు. తన కొడుకు చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష వేసినా సబబే అని అన్నారు. అయితే, ఈ ఘటనలో సంధ్యా రాణి చేసిన తప్పులు కూడా చూడాలని అన్నారు. గురువారం సాయంత్రం లాలాగూడలో నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణి(22)పై కార్తీక్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.

కాగా, కార్తీక్ తల్లి ఊర్మిల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల నుంచి సంధ్యారాణి, కార్తీక్ ప్రేమించుకుంటున్నారని తెలిపింది. సంధ్యారాణి తమ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదని చెప్పింది. తమ కూతురుకు కూడా ఆమె స్నేహితురాలేనని చెప్పారు. సంధ్య అంటే తనకు కూడా ఇష్టమేనని చెప్పింది.అయితే, కార్తీక్ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని ఊర్మిళ తెలిపింది. సెల్ ఫోన్, బట్టలు, ఇతర వస్తువులు కూడా సంధ్యకు కొనిచ్చేవాడని తెలిపింది. అయితే కొన్నాళ్ల నుంచి తన కొడుకుకు సంధ్య దూరం ఉంటోందని చెప్పింది. వారం క్రితం కూడా తమ ఇంటికి సంధ్య వచ్చిందని తెలిపింది. తన కొడుకును పెళ్లి చేసుకోనని సంధ్య తేల్చి చెప్పిందని ఆమె తెలిపింది. దీంతో తాను తన కొడుకుకు ఫోన్ చేయవద్దని, తమ ఇంటికి రావద్దని సంధ్యకు చెప్పానని ఊర్మిళ తెలిపింది. ఆమె వెంట పడొద్దని తన కొడుకు కార్తీక్ కు కూడా చెప్పానని తెలిపింది.