According to a survey making rounds in Social media says Telangana Rastra Samithi (TRS) will loose the power. This is not having any scientific reasons.
తెలంగాణలో ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు షాక్ తప్పదట. సోమవారంనాడు ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఓ సర్వే చేశారట. ఆ సర్వే ఎవరు చేశారు, ఎంత మందిని సర్వే చేశారు, శాంపిల్ సిస్టమ్ ఏణిటి, పొత్తులను పరిగణనలోకి తీసుకున్నారా అనే విషయాలు మాత్రం తెలియవు. కానీ తెలంగాణలో సంకీర్ణం తప్పదంటూ ఆ సర్వే తేల్చిచెబుతున్నట్లు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 110 దాకా సీట్లు వస్తాయని కెసిఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 119. అంటే ఆయన చెప్పేదాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. మగిలిన సీట్లలో మజ్లీస్ ఆరు, మిగతావాళ్లకు మూడు వస్తాయని కెసిఆర్ చెబుతున్నారు.