Arun Vijay, who is currently busy with the shooting of Thadam, has spilled the beans about his upcoming trilingual film Saaho, which stars Prabhas in the lead role, in a recent interaction.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో వెలుగు చేసింది.
సాహా చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మరో విలన్ కూడా ఉన్నారు. ఆ విలన్ పాత్రను తమిళ నటుడు అరుణ్ విజయ్ పోషిస్తున్నట్టు మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన అరుణ్ విజయ్ ఈ కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం థాండమ్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. సాహోలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాను. అయితే నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి విలన్ పాత్రలో కనిపిస్తున్నాను అనే వార్తలో నిజం లేదు అరుణ్ విజయ్ తెలిపారు.