OBC leader Alpesh Thakore, who is fighting the Gujarat elections on a Congress ticket has accused PM Modi of “splurging” on mushrooms. “The PM eats imported mushrooms.
గుజరాత్ ఎన్నికలు, ఎన్నికల ప్రచారాలు వాడి వేడి గా సాగుతున్నాయి. ఇప్పటికే తోలి విడత పోలింగ్ ముగియగా రెండో విడత పోలింగ్ 14 న జరగనుంది. ఈ నేపధ్యంలో ఇరు పార్టీలు ప్రచారంలో బిజీ గా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్ లో 150 కిలోమీటర్ల దూరం సముద్ర విమానంలో ప్రయాణించారు. గుజరాత్ లోని సబర్మతి నదిలో సముద్ర విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ ధారోయ్ డ్యామ్ కు చేరుకున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ మరోసారి గుజరాత్‌లో ఆలయాలు సందర్శించారు. ప్రధానంగా అహ్మదాబాద్‌లోని ప్రఖ్యాత జగన్నాథ్ ఆలయాన్నిరాహుల్ గాంధీ మంగళవారం సందర్శించారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇద్దరు నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో ఆలయాలు సందర్శించారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కూడా జరిగింది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పాలనకు సహజంగానే వ్యక్తమయ్యే వ్యతిరేకతకు తోడు పాటిదార్ ఉద్యమం కూడా ఈసారి బీజేపీకి ప్రతికూలంగా మారింది. జిగ్నేష్ మేవాని, అల్ఫేష్ ఠాకూర్, హార్థిక్ పటేల్ లాంటి యువ నాయకత్వం బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసింది. దీంతో బీజేపీ గెలుపుపై ఆ పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేత అల్ఫేష్ ఠాకూర్ మోడీ పై నమ్మలేని నవ్వుకునే కొన్ని వ్యాఖ్యలు చేసారు.