Rakul Preet Singh has made a name for herself not just in Telugu film industry, but also in Tamil, Hindi and Kannada.Her movie Khakee with Hero Karthi got huge success in Telugu, and Tamil.
టాలీవుడ్‌లో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోని హ్యాపీగా ఉన్నారు. వారి దారిలోనే మరికొందరు టాలీవుడ్ హీరోలు నడువడానికి సిద్దపడుతున్నారనే వార్తలు ఇటీవల కాలంలో బాగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్యలో సాయి ధరమ్ తేజ్, రెజీనా పెళ్లి వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమన్నాయి. ఆ తర్వాత పెద్దగా పసలేకపోవడంతో ఆ వార్తలు చప్పుమన్నాయి. తాజాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుదన్నదనే నిరాధారమైన వార్త తెలుగు మీడియాలో గుప్పుమంటున్నది.
ఏ విషయంపైనైనా రకుల్ ప్రీత్ సింగ్ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దాటేయ్యకపోవడం ఆమె ఉన్న మంచి లక్షణాల్లో ఒకటి. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో మీడియాతో షేర్ చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి.
తనకు కాబోయే భర్త కనీసం ఆరడుగుల ఎత్తు ఉండాలని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. తాగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను తెలుగింటి కోడలు కావొద్దా అని చెప్పిన మాటలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. అంటే తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం అనేక సందేహాలకు తెరలేపాయి.
తెలుగింటి కోడలు కావడానికి నేను రెడీగా ఉన్నానని ఈమె సంకేతాలు ఇవ్వడం విశేషం. సమంతలాగే రకుల్ కూడా తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే రకుల్ పెళ్లి చేసుకొనేది సినీ పరిశ్రమకు చెందిన వాడినా లేక బయట వ్యక్తినా అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో అది గాసిప్‌గానే మారింది.