Akhil Akkineni Emotional Speech At HELLO Audio Launch. Hello Movie Audio Launch event held at Vizag on Sunday. Directed by VikramKKumar, Music Composed By AnupRubens, Produced by Nagarjuna Akkineni under Annapurna Studios.
అఖల్ హీరోగా తెరకెక్కిన 'హలో' మూవీ ఆడియో వేడుక వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అదిరిపోయే డాన్స్ చేసిన అఖిల్.... ఆ తర్వాత మైక్ అందుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు. 'గడిచిన సంవత్సర కాలం నా జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఈ రోజు ఇలా ఇంత కాన్ఫిడెంట్‌గా నిలుచున్నాను అంటే కారణం మా అమ్మా నాన్న' అని అఖిల్ వ్యాఖ్యానించారు.
నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను.... వారు గర్వపడేలా చేస్తాను.' అని అఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు.
డైరెక్టర్ విక్రమ్ నన్ను కలిసినపుడు నేను నటన పరంగా చాలా తక్కువగా ఉన్నాను. ఎనర్జీ లెవల్స్‌తో పాటు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. హలో సినిమా ద్వారా నేను అన్ని విషయాల్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నీకు నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను. నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి." అని అఖిల్ అన్నారు.