¡Sorpréndeme!

చైనాలో సల్మాన్ సినిమా.. పేరు వింటే పడిపడి నవ్వుతారు.. !

2017-12-06 2,347 Dailymotion

Salman Khan's Bajrangi Bhaijaan set to release in China with funny name. This movie titled as Little Lolita Monkey God Uncle!. Bajrangi Bhaijaan has got an incredible 8.6 rating on the site so fans are eagerly looking forward to watch the movie.

చైనాలో దంగల్ చిత్రం విజయఢంకా మోగించిన తర్వాత చాలా బాలీవుడ్ నిర్మాతలు తమ చిత్రాలను అక్కడ ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రం చైనాలో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో రికార్డు కలెక్షన్లను వసూలు చేసిన చిత్రాలను చైనాలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి చిత్రాల జాబితాలో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని చైనాలో రీలీజ్ చేయడానికి సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నారు.
2015లో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం విడుదలై రికార్డుస్థాయి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 626 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 2015లో ఏడాదిలో ఇదే అత్యత్తమ చిత్రంగా నిలిచింది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పెట్టిన పేరు చాలా నవ్వు తెప్పించేలా.. సరదాగా ఉంది.
భజరంగీ భాయ్‌జాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ అంజనేయ భక్తుడు. వైద్యం కోసం పాకిస్థాన్ నుంచి భారత్‌కు తప్పిపోయిన బాలికను పాకిస్థాన్‌లోని తల్లిదండ్రులకు చేరేవేసే క్రమంలో సల్మాన్ ఎదుర్కొన్న ఇబ్బందులు భావోద్వేగాల అంశాల మేలవింపే ఈ సినిమా..