¡Sorpréndeme!

Jayalalithaa Case probe : విచారణకు వెంకయ్యనాయుడు, విద్యాసాగర్‌రావు కూడా !

2017-11-24 771 Dailymotion

Two senior state government doctors on Thursday appeared before the Justice Arumughaswamy Commission, which is probing the case of former Tamil Nadu chief minister and AIADMK supremo Jayalalithaa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్, తమిళనాడు ఉప ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వంను విచారణ చెయ్యాలని విచారణ కమిషన్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. జయలలిత మృతిపై విచారణ కోసం ఏర్పాటైన విచారణ కమిషన్‌ ముందు పలువురు ప్రముఖులు హాజరై విచారణ ఎదుర్కొంటున్నారు. జయలలిత అనుమానాస్పద మృతిపై మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్‌ ఆరుముగస్వామి ఆధ్వర్యంలో ఈ కమిషన్‌ ఏర్పాటు అయ్యింది. అమ్మ జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీ ఫారంపై అమ్మ వేలిముద్రలు వేసిన విషయం తెలిసిందే.
జయలలిత మృతి తర్వాతే వేలిముద్రలను బీ ఫారంలో వేయించారని తమిళనాడులోని తిరుప్పరకుండ్రం శాసన సభ నియోజక వర్గం డీఎంకే పార్టీ అభ్యర్థి డాక్టర్‌ శరవణన్‌ ఆరోపించారు. గురువారం కూడా డాక్టర్ శరవణన్ రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.