Pawan Kalyan's ex wife Renu desai acting as Judge for a dance show. She made sensational comments on NTR dance. Renu said that Junior NTR is the best in dialogue delivery and Dance moments. These comments made NTR fans happy but Mega fans hurted.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారుతున్నాయి. పలు టెలివిజన్ ఛానెల్లో ఆమె ఇంటర్వ్యూలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఆమె న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఓ డాన్స్ షోకు పెద్దగా టీఆర్సీలు లేకపోయినా.. రేణుదేశాయ్ వ్యాఖ్యల మాత్రం ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్నాయి. తాజాగా రేణుదేశాయ్ మాట్లాడిని మాటలు మాత్రం పవన్ కల్క్ష్ాన్ ఫ్యాన్స్కు ఇబ్బందికరంగా మారాయి. పవన్ అభిమానులు నొచ్చుకునే విధంగా రేణుదేశాయ్ ఏం మాట్లాడారంటే..
ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్లో ప్రసారం అవుతున్న నీతోనే డ్యాన్స్ షోలో రేణుదేశాయ్ జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో ఓ సెలబ్రిటీ జంట యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ పాటపై డ్యాన్స్ చేసిన జంటపై ప్రశంసలు కురిపించడానికి ముందు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత గొప్పగా పౌరాణిక డైలాగ్స్ చెప్పాలంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే సాధ్యం. డైలాగ్ కొట్టాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని రేణుదేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్పారు.అలాగే డాన్సులను కూడా ఎన్టీఆర్ ఇరుగదీస్తాడు. తారక్ గొప్ప డ్యాన్సర్. ఎలాంటి స్టెప్పులనైనా ఎన్టీఆర్ చాలా సులభంగా చేస్తారు అని రేణు దేశాయ్ అనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమంటే.. బన్నీ, ఎన్టీఆర్, రాంచరణ్ మాదిరిగా డ్యాన్స్ చేసే సత్తా ఇశ్వాలని కోరుకొంటాను. జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగా డ్యాన్స్ చేయాలంటే చాలా గట్స్ కావాలి అంటూ రేణు వ్యాఖ్యలు చేశారు.