Pretty actress Lakshmi Rai who was seen in item numbers opposite Chiranjeevi and Pawan Kalyan in ‘Khaidi No 150’ and ‘Sardar Gabbar Singh’ respectively, is now all set to reprise the role of Ms Lakshmi Parvathi, second wife of NTR, in the film upcoming film ‘Lakshmi’s Veeragrandham’ being produced by P Vijaykumar Goud.
ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ల "సిరీస్" హవా నడుస్తోంది. ఒక పక్క బాలయ్య తేజా కాంబినేషన్ లో ఒక బయోపిక్ వస్తుందన్న విషయమూ, అదే సమయం లో రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా లక్ష్మీ'స్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన సంగతీ తెలిసిందే.
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం చేస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుని రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ కాబోతుంది. అయితే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం నటి వాణీ విశ్వనాధ్‌ని దర్శకుడు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత వాణీ విశ్వనాధ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి.
"కాటమరాయుడు, ఖైదీ నెంబర్ 150" చిత్రాలలో స్పెషల్ సాంగ్‌లలో నర్తించిన రాయ్ లక్ష్మీని "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాలోని లక్ష్మీపార్వతి పాత్ర కోసం తీసుకున్నారని, ఈ పాత్రలో చేయడానికి ఆమె అంగీకారం తెలిపిందనే వార్తలు తాజాగా వ్యాపించాయి.