¡Sorpréndeme!

MCA Teaser Released MCA టీజర్ వచ్చేసిందోచ్..!

2017-11-10 2,336 Dailymotion

Watch the teaser of the film MCA(Middle-Class Abbayi). It is an upcoming Telugu film featuring Nani, Sai Pallavi in the lead roles. Bhumika plays a supporting role.

గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. తన సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటికే రెండు హ్యాట్రిక్ హిట్స్‌ను అందుకొని మూడో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోన్న ఈ హీరో ప్రస్తుతం ' మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) సినిమాలో నటిస్తున్నాడు.
నాని సాయిపల్లవి జంటగా నటిస్తున్న "ఎంసీఏ" (మిడిల్ క్లాస్ అబ్బాయ్) టీజర్‌ కొద్దిసేపటికిందటే రిలీజ్ అయ్యింది. ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేసిన ‘‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్' ఫస్ట్‌లుక్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో టీజర్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నాని తన అభిమానులకు మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఇక తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది చిత్ర యూనిట్ . ఇందులో ఎంసీఏ అంటే ఏంటో క్లుప్తంగా వివరించాడు నాని. "ఎప్పుడైనా షర్ట్ బటన్ ఊడిపోతే పిన్నీసు పెట్టుకొని మ్యానేజ్ చేసావా?? అంటూ మొదలుపెట్టి మొత్తంగా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ని చూపించేసాడు.
ఇక కొసమెరుపుగా సాయిపల్లవి క్యూట్ గా "నువ్వు నాకు బాగా నచ్చావ్ ఎప్పుడు పెళ్ళిచేసుకుందాం?" అని అడగటం ఇంకా సూపర్గా ఉంది. మొత్తానికి 'ఎంసిఏ' అలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' టీజర్ మాత్రం అదిరిందనే చెప్పాలి.