¡Sorpréndeme!

ఇలియానా ఆత్మహత్యా ప్రయత్నం

2017-11-06 1,010 Dailymotion

Actress Ileana D'Cruz, who had opened up about her struggle with Body Dysmorphic Disorder, revealed that at one point of time she had "suicidal thoughts and wanted to end things." At the 21st World Congress of Mental Health
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ మొదటి సినిమాతోనే తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా తన కాన్ ఫిడెన్స్ లెవెల్ ని మొదటినుంచీ అస్సలు తగ్గనివ్వలేదు. ఇక్కడ మంచి ఫాలోయింగ్ నీ పెద్ద ఆఫర్లనీ వదులుకొని బాలీవుడ్ వైపు అడుగులేసింది అయితే అక్కడ తనకి రెడ్ కార్పెట్ ఏమీ వెయ్యలేదు బర్ఫీ, రుస్తుం లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత కూడా ఇలియానాకి కోరుకున్న స్థాయిలో ఆఫర్లు రాకపోయినా మరీ వరస్ట్ అనుకునే పరిస్థితైతే రాలేదు గానీ ఆమెకు ఉండాల్సినంత గుర్తింపు రావటం కాస్త ఆలస్యం అయ్యింది.
అయితే ఇన్ని సమస్యలని ఎదుర్కోవటం లోనూ తన మానసిక స్థైర్యాన్ని కోల్పోని ఇలియానా ఒక దశలో మాత్రం విపరీతమైన డిప్రెషన్ లో పడిపోయిందట. అదీ తన జీవితాన్నే అంతం చేసుకోవాలనుకునేంత డిప్రెషన్ లో పడిపోయిందట,
తన జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా భావించినట్లు చెబుతోంది ఇల్లీ. అయితే.. దీనికి కారణం ఏంటనేది మొదట్లో తనకు తెలియదని.. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ కారణంగా.. అంటే తన శరీరంపై తనకు ఉన్న ఆలోచనల కారణంగానే ఇలా చేసినట్లు తర్వాత తెలిసిందని చెప్పింది.