¡Sorpréndeme!

Shah Rukh Khan birthday Celebrations : Intresting Facts

2017-11-04 1,591 Dailymotion


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలు ముంబైలోని ఆయన నివాసం మన్నత్ ఎదుట ఘనంగా జరిగాయి. నవంబర్ 2వ తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది షారుక్ అభిమానులు ఆయన ఇంటి ముందు బర్త్ డే వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి సమయానికి వేల సంఖ్యలో ఫ్యాన్స్ షారుక్ ఇంటికి చేరుకొని హంగామా చేశారు.
షారుక్ వేడుకల్లో పలువురు జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మొబైల్ ఫోన్ చోరీకి సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. భారీ ఎత్తున టపాకాయలు పేల్చడంతో ట్రాఫిక్ స్తంభించింది.
షారుక్ ఖాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబై నగర శివారులోని ఓ రిసార్టులో భారీగా విందును ఏర్పాటు చేశారు. షారుక్ బర్త్ డే విందు కోసం ఒకరోజు ముందే సెలబ్రిటీలు అక్కడికి చేరుకొన్నారు.
షారుక్ బర్త్ డే పార్టీకి హాజరైన వారిలో శ్వేతాబచ్చన్, మహీప్ కపూర్, సంజయ్ కపూర్, ఆయన కుమార్తే షనాయ, భావనపాండే, సుసానే ఖాన్‌లు ఉన్నారు.
పార్టీకి షారుక్ భార్య గౌరీఖాన్, కూతురు సుహానా, సుసానే ఖాన్ తదితరులు జెట్ విమానంలో వెళ్లడం విశేషం
ఇంకా ఈ పార్టీకి హాజరైన వారిలో ఆలియా భట్, దీపికా పదుకొన్, సిద్ధార్థ మల్హోత్రా, కరణ్ జోహర్, ఫర్షా ఖాన్ ఉన్నాడు. వీరంతా చాపర్ ఫ్లైయిట్‌లో షారుక్, అబ్‌రామ్‌తో కలిసి వెళ్లడం గమనార్హం. షారుక్ బర్త్ డేలో ఆకాశమే హద్దు అన్నంటూ అందాల భామలు ఎంజాయ్ చేసsaaru