Today trending news Watch Here. ys jagan padayatra in confusion. tdp leaders fire son Revanth reddy.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర తేదిల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముందుగా ప్రకటించినట్టుగా నవంబర్ 2వ, తేది నుండి కాకుండా నవంబర్ 6వ, తేది నుండి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని తలపెట్టాడు. అయితే తొలుత అక్టోబర్ మాసంలోనే పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. అయితే కొన్ని కారణాలతో పాదయాత్రను అక్టోబర్ నుండి నవంబర్ రెండవ తేదికి మార్చారు. అయితే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొన్న మీదట ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హజరు కావడంపై మినహయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.