ఉత్తరకొరియా నియంత కింగ్ జాంగ్ ఉన్ మొండితనం పట్ల అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. అమెరికాను బూడిద చేస్తానంటూ అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న కిమ్‌ను నియంత్రించే మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా కిమ్ పెడచెవిన పెడుతుండడంతో అమెరికా ఉన్నాతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దౌత్యపరమైన చర్చలు కొనసాగిద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.