The Bharatiya Janata Party legislator from the Mandalgarh constituency in Rajasthan’s Bhilwara district, Kirti Kumari, lost life of influenza A (H1N1), commonly referred to as swine flu in India,
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయిన కీర్తి కుమారి వారం రోజుల కిందట సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు